చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో దాడి చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని,కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇవాళ చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.
గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో.. ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే,గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. మాకు న్యాయం చేసే అంత వరకు మేము వినేదిలేదంటూ.. మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు కలగజేసుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
Also Read:హైదరాబాద్ వరకే హైడ్రా: సీఎం రేవంత్ రెడ్డి