ఆసీస్ బీచ్‌లో దాడి..సాయుధుల గుర్తింపు

5
- Advertisement -

ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ బీచ్‌లో చోటుచేసుకున్న సాయుధ దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను తండ్రీకొడుకులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారు నవీద్ అక్రమ్ (24), సాజిద్ అక్రమ్ (50)గా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్ధారించారు. నిందితులు పాకిస్థాన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన వారిగా పోలీసులు తెలిపారు.

బీచ్ ప్రాంతంలో ఆయుధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో నిందితులు కాల్పులకు పాల్పడటంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీద్ అక్రమ్‌ను గాయాలపాలైన స్థితిలో అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఘటనా స్థలంలో ఆరు రకాల ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో తుపాకులు, గుండ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది ఉగ్రదాడి ప్రయత్నమా లేక వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటననా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.

Also Read:నిర్మాణ రంగంలోకి వెంకీ కుడుముల

ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీచ్‌ను తాత్కాలికంగా మూసివేసి, స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -