అల్లు అర్జున్ ఇంటిపై దాడి..!

1
- Advertisement -

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టడమే కాదు ఇంటిపై టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. పలువురు గోడలు ఎక్కి లోపలికి దిగి బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు.

బౌన్సర్లు అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న మొక్కల కుండీలు పగలకొట్టారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేపడుతున్ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:ప్రముఖులకు డెమోక్రటిక్‌ సంఘం అవార్డులు

- Advertisement -