ఏటీఎం కార్డు పోయిందా..ఇలా చేయండి!

21
- Advertisement -

మన దైనందిత జీవితంలో ఏటీఎం కార్డు అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే బ్యాంక్ లో ఉన్న నగదును ఎప్పుడైనా, ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు కేవలం ఏటీఎంల ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం క్యాష్ లెస్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికి ఏటీఎంల యొక్క అవసరత చాలానే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏటీఎం కార్డు పొరపాటున పోగొట్టుకుంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే పలు సందర్భాల్లో కార్డు పోగొట్టుకోవడం లేదా ఏటీఎం సెంటర్లలో కార్డు మర్చిపోవడం వంటి పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఏటీఎం కార్డు పోగొట్టుకున్నప్పటికి నిర్లక్ష్యం వహిస్తుంటారు. అయితే అలా నిర్లక్ష్యంగా ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పోయిన ఆ కార్డు ఎవరికైనా దొరికినప్పుడు వారు దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. .

కాబట్టి కార్డు పోయిందని నిర్ధారణకు వచ్చిన వెంటనే కొన్ని పనులు తప్పక చేయాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు కాల్ చేసి పోయిన ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్ చేయించుకోవాలి. అందుకోసం కొన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి ఎస్బీఐ ( 1800112211 ), కరూర్ వైశ్య బ్యాంక్ ( 18802001918 ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 18002082244 ), కెనరా బ్యాంక్ ( 18004250081 ), ఐసీఐసీఐ బ్యాంక్ ( 18004252910 ), బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 1800224848 ).. ఇలా ఆయా బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు కాల్ చేసి ఏటీఎం కార్డు ను బ్లాక్ చేయించుకోవాలి. లేదా సంబంధిత బ్యాంక్ వద్దకు వెళ్ళి ఏటీఎం కార్డు పోయిందని చెప్పి బ్యాంక్ అధికారితో కార్డ్ ను బ్లాక్ చేయించుకొని కొత్త కార్డు కు అప్లై చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పోయిన ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకునే సౌకర్యం ఆయా బ్యాంకులు కల్పిస్తున్నాయి. కాబట్టి ఏటీఎం పోయిందని నిర్ధారణకు వచ్చిన వెంటనే ఈ పనులు చేయడం మర్చిపోకూడదు.

Also Read:మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!

- Advertisement -