అల్లు అర్జున్ తోనా ?.. అట్లీ స్పందన ఇదే

7
- Advertisement -

‘జవాన్‌’తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్‌. ఐతే, జవాన్ సక్సెస్ క్రెడిట్ షారుక్‌ ఖాతాలోకి ఎంత వెళ్లిందో తెలియదు గానీ, జవాన్ దర్శకుడు అట్లీ ఖాతాలోకి మాత్రం ఫుల్ గా వెళ్లినట్టు కనిపిస్తోంది. జవాన్ రిలీజ్ అయిన రోజే అల్లు అర్జున్, అట్లీకి ఫోన్ చేసి పొగడ్తల వర్షం కురిపించాడు. తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ ఓ ప్రపోజల్ కూడా పెట్టాడు. మరోవైపు మహేష్ నుంచి కూడా ఇలాంటి కాల్ వెళ్ళింది. అటు తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి అట్లీకి ఓపెన్ ఆఫర్ ఉంది. ఇటు షారుక్‌ ఖాన్‌ సీక్వెల్ చేద్దాం అంటూ అట్లీకి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో అట్లీకి ఉన్న అనుబంధం గురించి గతంలో అట్లీనే చెప్పాడు. కచ్చితంగా తారక్ తో సినిమా చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడు అట్లీ దారి ఎటు ?, ఆల్ రెడీ అట్లీ ఫలానా హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జవాన్ సినిమా పెద్ద హిట్ కావడంతో అట్లీ తదుపరి చిత్రం గురించి అంచనాలు, ఊహాగానాలు సహజంగానే పెరుగుతాయి, పెరిగాయి కూడా. అందుకే, తాజాగా కొన్ని వెబ్ సైట్లు అట్లీ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తోనే అంటూ కథనాలు అల్లేశాయి. ఇదే విషయాన్ని అట్లీ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే..

అవి పుకార్లు తప్ప నిజం కాదని దర్శకుడు అట్లీ అంటున్నారు. “నా దగ్గర స్టోరీయే లేదు. మీరు అప్పుడే హీరో ఫిక్స్, స్టోరీ రెడీ అంటే ఎలా ?, నిజానికి నాకంటూ రెస్ట్ కావాలి. నాకు హీరోలందరూ ఇష్టమే. ప్రస్తుతానికి నేను ఎవరితో సినిమా చేయాలి ? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నాకు షారుఖ్ ఖాన్ పై గౌరవం ఉంది. ఎన్టీఆర్ పై అభిమానం ఉంది. అలాగే విజయ్ కూడా మంచి స్నేహితుడు. వీరిలో ఎవరితోనైనా నేను సినిమా చెయ్యొచ్చు’ అంటూ అట్లీ క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ తో అట్లీ సినిమా ఫిక్స్ అయిందని వచ్చిన వార్తలకు ఆయన స్పందన ఇది.

Also Read:ఆగని జవాన్ సునామీ!

- Advertisement -