అతనితో సమంత హొయలు

35
- Advertisement -

శాకుంతలం పరాజయం సమంత ను తీవ్రంగా బాధ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సమంత డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందని, పైగా ఆమె తన ఫోన్ ను కూడా స్విచాఫ్ చేసేసింది అని వార్తలు వచ్చాయి. దీనికితోడు ఒక్క రోజులోనే సమంత బ్రాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ బాగా పడిపోయింది అని కూడా కొందరు ట్వీట్లు చేసి మరీ సమంత పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే, హీరోయిన్ గా సమంత కొత్త లుక్‌ లో వావ్ అనిపించింది. కొత్త లుక్స్ లో అదిరిపోయే అందాలతో కుర్ర హృదయాలను తెగ ఆకట్టుకుంది. నెటిజన్లు కూడా సమంత లుక్ చూసి షాక్ అవుతున్నారు. వావ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Also read: పవన్ తో ప్రియాంక రొమాన్స్

ఇంతకీ, సమంత ఈ లుక్ లో ఎక్కడ దర్శనం ఇచ్చిందో తెలుసా ?, లండన్‌లో ఏర్పాటైన సిటాడెల్ ప్రిమియర్ సందర్భంగా హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి ఈ క్రేజీ లుక్ లో సమంత ఫొటోలకు పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌ లో సమంత బుల్గారి నెక్‌ పీస్‌తో అందంగా కనిపించింది. సిటాడెల్ వెబ్‌సిరీస్ అమెజాన్‌ ప్రైమ్‌లో ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకు ప్రతి శుక్రవారం ఎపిసోడ్ వైస్ స్ట్రీమ్ కానుంది. ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత యాక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే బ్లాక్ డ్రెస్‌లో సమంత ఇలా హొయలు పోయింది.

Also read: మమ్మీ కాబోతున్న గోవా బ్యూటీ.. నిజమెంత..!

ఇక సమంత టైటిల్‌ రోల్‌ పోషించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’భారీ అంచనాల మధ్యవచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీనిపై స్పందించిన సమంత భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావిస్తూ తన ఫొటోను పంచుకున్నారు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి” అనే గీతా శ్లోకాన్ని రాసుకొచ్చారు. మొత్తానికి కష్టమే మన చేతుల్లో ఉంది, ఫలితం మన చేతుల్లో ఉండదు అని సమంత చెప్పుకొచ్చింది.

- Advertisement -