వాజ్‌పేయి మృతికి 7రోజుల సంతాప దినాలు..

247
vajpayee death
- Advertisement -

భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Atal Bihari Vajpayee

వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ సంతాప దినాలను పాటించనున్నారు. ఢిల్లీలోని స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం సగం రోజు సెలవును ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సీపీఎస్‌యూ ఉద్యోగులకు ఈ హాలీడే వర్తిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పంజాబ్ రాష్ర్టాలు రేపు సెలవు దినాన్ని ప్రకటించాయి.

- Advertisement -