ఆటా ఉగాది సాహిత్య వేదిక..

78
- Advertisement -

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో తెలుగు వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.

వసంతములో కోకిల మధురగానంలా “ఆటా ఉగాది సాహిత్య వేదిక” లో శ్రీ రామాచారి కొమాండూరి గారి సకల సంగీత ప్రక్రియలకు శ్రీ పమిడికాల్వ మధు సూదన్ గారి సాహిత్య వివరణ ఉంటుంది. ఈ సందర్భంగా సంగీత సాహిత్య అభిమానులకు సాదర ఆహ్వానం పలుకుతుంది అమెరికా తెలుగు సంఘం.

2023 ఏప్రిల్ 1న ఆటా ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శోభకృత నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఉండనుంది.ఇక అదేరోజు వాషింగ్టన్ డీసీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాయంత్రం జరగనుంది.దీనికి ఎంట్రీ ఫీజు ఉచితం.

ఇక తర్వాత న్యూయార్క్‌/న్యూజెర్సీలో ఏప్రిల్ 2న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్ 8న శాండిగోలో ఉగాది, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.అలాగే ఏప్రిల్ 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -