అమెరికాలో ఆటా మహిళా దినోత్సవం..

262
ATA International Women's Day 2018
- Advertisement -

అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఇటీవల ఘనంగా న్యూ జెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్ లో ఘనంగా జరిగాయి. ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వాహక సంఘం సభ్యురాలు ఇందిరా రెడ్డి జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాగతోపన్యాసం చేశారు. అతి పిన్న వయస్సు గల ఆసియన్ అమెరికన్ సెనెటర్ న్యూ జెర్సీ స్టేట్ సెనెటర్ విన్ గోపాల్ విశిష్ట అతిధిగ రావడంతో పూర్వ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి గారు సభకు పరిచయం చేశారు, విన్ గోపాల్ గారు మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి, మహిళలు అన్ని రంగాల్లో ఆర్ధిక స్వావలంబన, వ్యాపార రంగం , సేవ రంగాల్లో రాణించడం గురించి చర్చించారు.

న్యూ జెర్సీ ఫ్రీ హోల్డర్ కుమారి శాంతి నర్రా మాట్లాడుతూ మహిళలు కూడా అమెరికా రాజకీయాలలోకి రావాలని కోరారు.ప్రముఖ సాంప్రదాయక కూచిపూడి డైరెకర్ ఇందిరా రెడ్డి స్థాపించిన “సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్” చేస్తున్న విశిష్ట సేవలకు గాను, డాక్టర్ ఇందు గోపాల్ సన్మానం మరియు జ్ఞాపికను అందచేశారు

ఆటాప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ అమెరికా తెలుగు ఆసోసియేషన్ చేస్తున్న పలు సేవ కార్యక్రమాలు అద్భుతముగా ఉన్నాయి అని తెలుపుతూ, అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా డల్లాస్‌, టెక్సాస్‌లలో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించబోయే తెలుగు కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు.

అటా న్యూ జెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తలు రవీందర్ గూడురు మరియు విలాస్ రెడ్డి జంబుల మరియు లోకల్ ఆటా బోర్డు ట్రస్టీ సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్స్ మిగితా ఆటా లోకల్ సభ్యులు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు.అలాగే, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి, మాజీ ప్రెసిడెంట్లు సుధాకర్ పెర్కారి , రాజేందర్ జిన్నా ,సలహా కమిటీ సహా కన్వీర్ సురేష్ జిల్లా, ట్రస్ట్లు అయినా పరశురామ్ పిన్నపురెడ్డి , రఘు రెడ్డి , శ్రీను దార్గుల , రవి పట్లోళ్ల , స్టాండింగ్ కమిటి రమేష్ మాగంటి, అంతర్జాతీయ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ గుడిపాటి, రీజినల్ అడ్విసోరీ రాజ్ చిముల సహాయ సహకారాలు అందించారు.

అదేవిధముగా కమ్యూనిటీ లీడర్స్ నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని , తానా రీజినల్ కో-ఆర్డినేటర్ విద్య గారపాటి , టిపాస్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పల , సిలికానాoధ్ర మనబడి వైస్ ప్రెసిడెంట్ శరత్ వేట మరియు టాటా సభ్యులు శివ బి రెడ్డి గార్లు , పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని విజయవంతం చేశారు. మహిళలు తమ వృత్తినీ, సంసార బాధ్యతలను సమతూకంగా నిర్వహించుకోవడం,
విశ్వవ్యాప్తంగా తమ ప్రతిభాపాటవాలతో ఖ్యాతి సంపాదించిన మహిళామణులను గురించి నందిని దార్గుల , మాధవి అరువ, అనురాధ దాసరి , వినీల రెడ్డి , అరుంధతి షాకెళ్లి , ఇందిరా సముద్రాల , శ్రీదేవి ఒబ్బినేని , నందిత తడసిన, దీపికా బెలుం , మాధవి గూడూరు, జమున పుస్కూర్, భాను మాగంటి , సంగీత ధన్నపనేని , మాధవ గూడూర్, స్వర్ణ భీం రెడ్డి , జ్యోతి , నిహారిక గుడిపాటి ,శ్రీలత రెడ్డి , చిత్రలేఖ జంబుల మరియు ఇతర మహిళ సభ్యులు సభను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తరచుగా వార్తలలో తారసిల్లే భారతీయ మహిళలను గురించి సంయుక్తంగా క్విజ్ పోటీ అనేకమందిని ఆకర్షించింది. సభ్యులు ఉత్సాహంగా క్విజ్ లో పాల్గొని సమాధానాలు చెప్పడంలో పోటీలు పడ్డారు.

- Advertisement -