లోకేష్‌తో టీడీపీకి అరిష్టం…

270
Astrology Guru Venu Swamy Sensational Comments on Lokesh
- Advertisement -

వేణు స్వామి… తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు, తాజా రాజకీయ పరిణామాలను తనదైన విశ్లేషణతో దానికి జ్యోతిష్యం జోడించి సంచలనం సృష్టించడంలో సిద్దహస్తులు. జయలలిత మరణం దగ్గరినుంచి అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ వరకు ఆయన చెప్పిన జ్యోతిష్యం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో బాంబు పేల్చాడు వేణుస్వామి. టీడీపీ యువనేత లోకేష్‌ వల్ల ఆపార్టీకి ఇబ్బందులు తప్పవని ఆయన చెబుతున్నారు. లోకేష్‌తో పార్టీకి అరిష్టమని తేల్చిచెబుతున్నారు.  భూమా నాగిరెడ్డి  చనిపోవడం వంటి పరిణామాలన్నీ లోకేష్ గ్రహస్థితి కారణంగానే జరుగుతున్నాయని వేణుస్వామి వివరించారు. లోకేష్ జాతకంలో అష్టమ దశ శని ప్రభావం కొనసాగుతోందని.. ఆయన వల్ల పార్టీకి నేతలకు చాలా ఇబ్బందులు రానున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2018లోనే ఎన్నికలు జరగడం మాత్రం ఖాయమని చెబుతున్నారు.

మార్చి 29 తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామాలుంటాయని… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఈ ఉగాది తరువాత నుంచే తమ పని ప్రారంభించాలని ఆయన సూచించారు.   180 ఏళ్ల తర్వాత కుజుడు రాజు స్థానంలోకి వస్తున్నారని ఇలా జరిగినప్పుడు యుద్ధాలు రావడం పెద్ద నాయకుల మరణాలు మంత్రులకు సమస్యలు అధిక మరణాలు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -