ఆస్తమా అనేది నేటిరోజుల్లో చాలమందిని వేదిస్తున్న సమస్య.. పిల్లలు, పెద్దలు, అని తేడా లేకుండా ఈ సమస్య చాలమందిని వేధిస్తుంటుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కాస్త ఒత్తిడికి లోనైనా, లేదా టెంక్షన్ కు గురైన, సవ్యంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయంలో హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆస్తమాను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా పేషెంట్లు ఎల్లప్పుడు ఇన్ హేలర్ ను వెంటే ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఆస్తమా పేషెంట్లకు రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోవడం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుతాయి. ముఖ్యంగా దానిమ్మ, బీట్ రూట్ వంటివి ఎక్కువగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆస్తమా రోగులకు డి విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ డి సూర్యరశ్మి నుంచి అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 వరకు సూర్యరశ్మి తగిలేల చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గుడ్లు, సాల్మన్ చేపలు, సోయా పాలు, వంటి వాటినుంచి కూడా డి విటమిన్ లభిస్తుంది. విటమిన్ ఏ కూడా ఆస్తమా రోగులకు ఎంతో కీలకం.. విటమిన్ ఏ అనేది ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరుస్తుంది.
అందుకే విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, చిలకడ దుంపలు వంటివి తినాలి. అయితే ఆస్తమా రొగులు తినకూడని ఆహారపదార్థాలు కూడా చాలానే ఉన్నాయి. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లీపాయలు, నూనెలో వేయించిన ఆహారం, శీతల పానీయాలు వంటి వాటికి సాద్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి అధికంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు.. అధికంగా గ్యాస్ ఉత్పత్తి అయితే శ్వాస క్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఇక జంక్ ఫుడ్ కూడా ఆస్తమా త్వరగా రావడానికి ఒక కారణం అనే చెప్పవచ్చు. కృత్రిమ స్వీటేనర్లు, ఫ్రీజర్వేటివ్ లు వంటివి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఇలాంటి ఆహార పదార్థాలతో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎంతో జాగ్రత్త వహించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Also Read:చత్తీస్‌గఢ్ సీఎంగా విష్షు దేవ్ సాయ్..