కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం

220
Assembly session against spurious seeds
- Advertisement -

ప్లీనరీలో హైలెట్ రైతే రాజని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్లీనరీ ముగింపు ఉపన్యాసం చేసిన   సీఎం  తెలంగాణ బాగుపడాలన్నదే తమ ఆశయమని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో విత్తనాలకు కల్తీ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని…రైతు నష్టపోతే ఆ మొత్తాన్ని కంపెనీల నుంచే వసూలు చేస్తామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చట్టం తీసుకొస్తామన్నారు.

మార్కెట్ కమిటీల్లో అన్నివర్గాల వారికి ప్రాధాన్యం దక్కేలా చూశామని చెప్పారు సీఎం. ప్రైవేట్ ఆసుపత్రులు, కాలేజీల దోపీడిలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.త్వరలో గిరిజన ,ఎస్సీ మహిళలకు డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. అవినీతి రహితంగా తాము పనిచేస్తున్నామని…ఇకపై ప్రతిపక్షాలు చేసే అసంబద్ద ఆరోపణలపై కేసులు నమోదుచేస్తామని తెలిపారు. ఈమేరకు ఆయా శాఖమంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చాక ఇసుకపై ఆదాయం పెరిగిందన్నారు.

ప్లీనరీ విజయవంతం కావడానికి సహకరించిన వారందిరికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రజల మనోభిష్టాలను నేరవేర్చేవిధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను పుస్తకం రూపంలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇకనుంచి పార్టీ కార్యకర్తల శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తామని వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఈ సందర్భంగా ఎంపీ మల్లారెడ్డి,ఎమ్మెల్సీ సలీం,నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నేత తేరా చిన్నపరెడ్డి రూ.25 లక్షల విరాళాన్ని పార్టీకి అందజేశారు.

- Advertisement -