ఈనెల 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆర్థిక స్థితి, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వేదికగా ఈ బడ్జెట్ సెషన్ ఉండనుంది.
బడ్జెట్ సమావేశాలకు ముందే శాఖల వారీగా సీఎస్ (చీఫ్ సెక్రటరీ) సమీక్షలు పూర్తయ్యాయి. ఆయా శాఖల ఖర్చులు, అవసరాలు, ప్రాధాన్యాలపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరగింది. ఈ సమీక్షల ఆధారంగా త్వరలోనే శాఖాధిపతులతో సీఎం మరియు డిప్యూటీ సీఎం కలిసి బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలకు తుది రూపు ఇచ్చే అవకాశముంది.
ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో ఇచ్చే ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చ జరగనుంది. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ సెషన్ రాజకీయంగా, ఆర్థికంగా కీలకంగా మారనుంది.
Also Read:తేజ సజ్జా మిరాయ్..అదిరే టీఆర్పీ!

