విడాకులపై స్టార్ హీరోయిన్ క్లారిటీ

51
- Advertisement -

‘గజినీ’ సినిమా హీరోయిన్ అసిన్ విడాకులు తీసుకుంటుందని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఉన్నటుండి ఇన్ స్టా గ్రామ్‌లో తన భర్త రాహుల్ శర్మకు సంబంధించిన అన్ని ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. 2016లో అసిన్.. మైక్రోమాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య అసిన్ ఎవరో ఓ వ్యక్తితో కనిపిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా ఈ ముదురు బ్యూటీ అతనితో చాలా క్లోజ్ గా ఉంది.

ఈ క్రమంలోనే అసిన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోందని.. అతనితో ప్రేమలో ఉందని.. అందుకే తన భర్త రాహుల్ శర్మకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అసిన్ దీనిపై ఎలా స్పందిస్తుందో అని అనుకునే లోపే స్పందించింది. తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అర్థం చేసుకున్న అసిన్ క్లారిటీగా తన భర్తతో విడాకుల పై మాట్లాడింది. ఉన్నది ఉన్నట్లు చెప్పిందో లేక, కవర్ చేయడానికి మెసేజ్ పెట్టిందో తెలియదు గానీ, మొత్తానికి అసిన్ క్లారిటీ అయితే ఇచ్చింది.

Also Read: Neenagupta:కిస్ సీన్ చేశాక డెటాల్‌తో శుభ్రం..!

అసిన్ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం నా భర్త రాహుల్ శర్మతో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను.’ అని అసిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. మరి రాహుల్‌తో కలిసి మీరు దిగిన ఫొటోలను ఎందుకు తొలగించారు ?, విడాకుల పుకార్లు మొదలయ్యాయి కాబట్టి.. ఇప్పుడు ఇలా సమాధానం చెబుతున్నారా? అని అసిన్ ను నెటిజన్లు అడుగుతున్నారు. కానీ ఆమె మాత్రం మళ్లీ ఈ విషయం పై మాట్లాడటం లేదు.

Also Read: నేడు 3 సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్

- Advertisement -