గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన రాంబాబు..

531
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిర్మల్ సంయుక్త పాలనాధకారి భాస్కర్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి స్థానిక ఐకెపి కాంప్లెక్స్ లో 3 మొక్కలను నాటారు కోమురంభీం ఆసిఫాబాదు సంయుక్త పాలనాధికారి పి.రాంబాబు.

ఈ సందర్భంగా సంయుక్త పాలనాధికారి పి.రాంబాబు మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణభాస్కర్, సంయుక్త పాలనాధికారి యాస్మిన్ భాషా కు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని అందుకు సంతోష్ కు ధన్యవాదాలు తెలిపారు. మొక్కలను పెంచడం భవిష్యత్తు తరాలకు మంచిదని పర్యావరణాన్ని కాపాడుకోవలసిన అవసరం మన అందరిపై ఉందని అన్నారు.

- Advertisement -