గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆసిఫాబాద్ డీఎఫ్‌ఓ

427
dfo
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమ రూపంలో సాగుతోంది. గ్రీన్ ఛాలెంజ్ ను జిల్లా కలెక్టర్నుం డి స్వీకరించి మూడు మొక్కలు నాటారు డీఎఫ్ఓ లక్ష్మణ్ రంజీత్ నాయక్. అనంతరం మొక్కలు నాటుదాం – ప్రకృతిని అందంగా ఉంచుదాం – మనందరం ఆనందంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు.

మొక్కలంటే తనకు చాలా ఇష్టం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు ఊపిరి, శ్వాస అవే. శ్వాసకు మూలమైన ఆక్సిజన్‌ను ఇచ్చే చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అన్నారు.

మొక్కలు నాటిన అనంతరం విష్ణు ఎస్‌ వారియర్ SP ఆదిలాబాద్, రాహుల్ హెగ్డే, SP సిరిసిల్ల మరియు కృష్ణ ఆదిత్య, ITDA PO లకు ఈ ఛాలెంజ్ ఇచ్చారు.

- Advertisement -