ఆసియా కప్‌..శ్రీలంకతో ఆఫ్ఘాన్‌ ఢీ!

63
ind
- Advertisement -

ఆసియా కప్‌ నేటి నుండి ప్రారంభంకానుంది. యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనుండగా తొలి మ్యాచ్‌లో శ్రీలంక – ఆఫ్ఘానిస్తాన్ తలపడనున్నాయి. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌.. గ్రూప్‌ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ జట్లున్నాయి. ఈ గ్రూపుల్లో టాప్‌-2గా నిలిచిన జట్లు సూపర్‌ 4కు అర్హత సాధిస్తాయి. అక్కడ ప్రతీ టీమ్‌ ఇతర మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్‌-2 జట్లు తుది పోరుకు అర్హత సాధిస్తాయి.

సెప్టెంబరు 11న ఫైనల్‌ మ్యాచ్‌. ఇది 15వ ఆసియాకప్‌ కాగా తొలిసారి 2016లో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. 2018లో చివరిసారి యూఏఈలోనే జరిగిన ఆసియాక్‌పలో విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గానే కనిపిస్తోంది.

గ్రూప్‌-ఎ:భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌
గ్రూప్‌-బి:శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌

- Advertisement -