ఆసియా కప్‌లో మళ్లీ భారత్ – పాకిస్తాన్ తలపడనున్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండగా పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో గెలుపొంది సూపర్ 4కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఫకార్ జమాన్(50) పరుగులు చేయగా షాహిన్ షా అఫ్రిది(29 నాటౌట్; 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ బ్యాటర్లలో రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాషర్ (20) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో యూఏఈ ఓటమి తప్పలేదు.
గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ జట్లు సూపర్-4లో అడుగుపెట్టాయి. ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించాయి. సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) న దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ తలపడనున్నాయి.
Also Read:‘భద్రకాళి’..నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ!

