దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లా భారత్ ముందు 223 పరుగుల టార్గెట్ విధించింది. ఓపెనర్ లిటన్ దాస్ అద్భుత సెంచరీతో రాణించాడు. కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన దాస్ బంగ్లా స్కోరు 200 పరుగులు దాటడంలో కీలకపాత్ర పోషించాడు. దాస్ రాణించడంతో 48.3 ఓవర్లో 22 పరుగులకు ఆలౌటైంది.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దాస్ కేవలం 87 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తొలి పవర్ ప్లేలోనే భారీ షాట్లతో చెలరేగిన దాస్.. మరో ఓపెనర్ హసన్ (32: 59 బంతుల్లో 3×4)తో కలిసి తొలి వికెట్‌కి 20.5 ఓవర్లలోనే 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 117 బంతుల్లో 121 పరుగులు చేసిన దాస్‌ను దోని తన మార్క్‌తో స్టంపౌట్‌గా వెనుదిరిగేలా చేశాడు.
ఈ దశలో హసన్ ఔటవగా.. అనంతరం వచ్చిన ఇమ్రూల్ (2), ముష్ఫికర్ (5), మహ్మద్ మిథున్ (2) పేలవరీతిలో వరుసగా పెవిలియన్ చేరిపోయారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3,కేదార్ జాదవ్ 2 వికెట్లు,చాహల్ ఒక వికెట్ తీశారు.