శ్రీలంకతో భారత్‌ కీ ఫైట్

188
ind
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఫైనల్‌కి చేరాలంటే నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కి కలిసివచ్చే అంశంకాగా మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా నిలకడ కనబర్చాల్సిన అవసరం ఉంది. ఇక శ్రీలంక కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు బాటలు వేయాలని భావిస్తోంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, కార్తీక్‌/పంత్‌, పాండ్యా, అక్షర్‌, భువనేశ్వర్‌, అవేశ్‌ ఖాన్‌, అర్శ్‌దీప్‌, చాహల్‌.

శ్రీలంక: షనక (కెప్టెన్‌), పతుమ్‌, కుషల్‌, చరిత, గుణతిలక, రాజపక్స, హసరంగ, చమిక, మహేశ్‌, ఫెర్నాండో, మధుషనక.

- Advertisement -