నేడే అఫ్గాన్‌-భారత్‌ పోరు..

250
India vs Afghanistan
- Advertisement -

హాంకాంగ్‌తో ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ కాస్త కష్టపడినట్టు కనిపించింది కానీ, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అదరగొట్టింది.ఆసియాకప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే దాదాపు ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్‌ జట్లు సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అయినా.. సూపర్‌-4 తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు పోరాడిన అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే చేదు అనుభవం తప్పదు. మరోవైపు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్‌.. హ్యాట్రిక్‌ గెలుపుపై కన్నేసింది.

India vs Afghanistan

భారత్‌ జట‌్టు: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాయుడు, దినేశ్‌ కార్తీక్‌/రాహుల్‌, ధోనీ, కేదార్‌ జాదవ్‌, జడేజా, కుల్దీప్‌, భువ నేశ్వర్‌/ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా/దీపక్‌ చా హర్‌, చాహల్‌.

అఫ్ఘానిస్థాన్‌ జట‌్టు: మహ్మద్‌ షెహజాద్‌, ఇషానుల్లా, రహమత్‌ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్ఘన్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ నబీ, సమీయుల్లా షన్వరీ, గుల్బదిన్‌ నయీబ్‌, రషీద్‌ ఖాన్‌, అఫ్తాబ్‌ ఆలమ్‌, ముజీబుర్‌ రహమాన్‌.

- Advertisement -