బెంగళూరు టెస్టులో కోహ్లి సేన ఘనవిజయం

201
Ashwin's 6 for 41 helps India defend 188
- Advertisement -

బెంగళూరు వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో టీమిండియా విజయం వాకిట నిలిచింది. 188 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌ మెన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వీరికి పిచ్‌ కాస్త సహకరించడంతో కంగారు బ్యాట్స్ మెన్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. స్వల్ప లక్ష్యమైన చేదించలేక విలవిలలాడిపోయారు. కేవలం 112 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. గెలుపుపై ఏ మాత్రం అంచనా లేని  కోహ్లి సేన సమిష్టిగా రాణించడంతో  75   పరుగుల తేడాతో గెలుపొంది మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్‌ ను 1-1తో సమం చేసింది.

ఆరంభం నుంచే ఆసీస్ బ్యాట్స్ మెన్‌ పై భారత బౌలర్లు విరుచుకపడ్డారు. క్రీజులో నిలదొక్కుకునే గట్టి ప్రయత్నమే చేసిన భారత బౌలర్ల ముందు ఆ పప్పులు ఉడకలేదు. వార్నర్ 17,రెన్ షా 5, స్మిత్ 28, మార్ష్ 9,హండ్స్ కాంబ్ 24 పరుగులు చేయగా మథ్యు వేడ్ 0,మిచెల్ మార్ష్ 13 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్, జడేజా తలో వికెట్ తీశారు.

అంతకముందు నాలుగో రోజు తొలిసెషన్‌లో హేజిల్‌వుడ్‌ ధాటికి భారత్‌ చేతులెత్తేసింది. సోమవారం మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీసిన హెజిల్‌వుడ్‌.. నాలుగోరోజూ విజృంభించాడు. తొలి సెషన్‌లో భారత్‌ ఆటగాళ్లు కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో హేజిల్‌వుడ్‌ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో స్వల్ప వ్యవధిలోనే భారత్‌ కీలక వికెట్లు కోల్పోయింది. మరోపక్క స్టార్క్‌ కూడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్‌ నడ్డి విరిచాడు. ఈ క్రమంలోనే పుజారా-రహానె 118పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

దీంతో  రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 274 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 189 పరుగులు చేయగా.. ఆసీస్‌ 274 పరుగులు చేసి 87 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -