‘అశ్వనీ దత్’ తెలుగు సినీ పరిశ్రమలోనే ప్రముఖ సినీ నిర్మాత. అటు చరిత్రలోనూ అశ్వనీ దత్ ‘వైజయంతీ మూవీస్’ కి గొప్ప పేరు ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాలకు కూడా భారీ గిరాకీ ఉంది. ఒకరకంగా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా ప్రభాస్ కల్కి. ఇంతటి పెద్ద నిర్మాతకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉంది.
ఏపీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఆయన గెలవాలనుకుంటున్నారు. నిజానికి గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అశ్వనీ దత్ ఎంట్రీ ఇచ్చి ఓడిపోయారు. అప్పటి నుంచి మళ్లీ అశ్వనీ దత్ డైరెక్ట్ రాజకీయాల జోలికి పోలేదు.
కానీ, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుస్తానంటూ చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆయన ఎలాగూ టీడీపీలో ఎప్పుడో చేరిపోయారు. పైగా నేరుగా టీడీపీ పార్టీతోనే ఆయన కలిసి ఉన్నారు. ఇక ‘అశ్వనీ దత్’ స్వస్థలం విజయవాడ. ఆయన తన సొంత ఊరిలో ఎలాగైనా సీటును తెచ్చుకుని పోటీ చేయాలి అనుకున్నారు. ఇప్పటికే ‘అశ్వనీ దత్’ కు ఎంపీ సీట్ కూడా రిజర్వ్ చేసి ఉందట. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. జగన్ బలం ముందు, బలగం ముందు అసలు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగలరా ?.
ఒకవేళ వచ్చినా.. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆర్ధికంగా టీడీపీ పార్టీ పట్టు కోల్పోయేలా ఉంది. అందుకే, ‘అశ్వనీ దత్’ చూపు ఇప్పుడు రాజకీయాల వైపు నుంచి తిరిగి సినిమాల వైపుకు వచ్చేలా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కొన్ని చోట్ల కనీసం డిపాజిట్ కూడా చేసుకోలేకపోయింది. అందుకే ఈ సారి టీడీపీ గెలుపు పై డౌట్ ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో క్రేజ్ ఉన్న జగన్ కి ఎదురు వెళ్లడం అంత మంచిది కాదు అని ‘అశ్వనీ దత్’కు కొందరు సలహాలు ఇస్తున్నారట. అందుకే, ‘అశ్వనీ దత్’ కూడా తన కోరికను చంపుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది.
Also Read:బాబు పై పూనమ్ కౌర్ ఇలా, మురళీమోహన్ అలా!