అశ్విన్ నెంబర్‌ 1 …. కోహ్లి నెంబర్ 3

239
Ashwin no 1.... Kohli No 3
- Advertisement -

భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ల విభాగంలో అశ్విన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. అశ్విన్ తర్వాతిస్థానంలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్ నిలిచాడు. ఐసీసీ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్ మెన్‌గా ఆసీస్ కెప్టెన్ స్మిత్ మొదటిస్ధానంలో నిలవగా టీమిండియా సారధి కోహ్లి రెండవ స్ధానంలో నిలిచాడు. ఇక బెస్ట్ బౌలర్ల జాబితాలో మనవాళ్లకే తొలి రెండు స్ధానాలు దక్కాయి. బెస్ట్ పర్ఫామెన్స్‌తో అశ్విన్‌ ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకోగా రవీంద్ర జడేజా రెండో స్ధానంలో నిలిచాడు.

ఇక వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు. మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఒక స్థానాన్ని మెరగుపరచుకొని 13వ ర్యాంకుకు ఎగబాకాడు. గాయంతో గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన రోహిత్‌ శర్మ మూడు ర్యాంకులు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు.

సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల్లో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 367 పరుగులతో రాణించడంతో బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే తొలిసారి మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. దీంతో గత కొద్ది రోజుల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ రెండో స్థానానికి పడిపోయాడు. మరోవైపు బౌలింగ్‌ విభాగంలో టీమిండియాకు చెందిన ఏ ఒక్క బౌలర్‌ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. అక్షర్‌పటేల్‌ ఒక్కడే 12వ స్థానంలో నిలిచాడు.

ఇక టీ 20ల్లో కోహ్లి అగ్రస్ధానంలో నిలవగా ఆసీస్ డాషింగ్ ఓపెనర్ రెండో స్ధానంలో నిలిచాడు. ఇక టీ 20 బెస్ట్ బౌలర్‌గా తాహిర్, బుమ్రా తొలి రెండు స్ధానాల్లో నిలవగా మ్యాక్స్ వెల్, షకిబుల్ హసన్‌ బెస్ట్ ఆల్ రౌండర్లుగా తొలి రెండు స్ధానాలను దక్కించుకున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది.

- Advertisement -