- Advertisement -
అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శివం భజే. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో అశ్విన్ బాబు ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో ఉండగా వెనక అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, దేవుడి విగ్రహం.. ఉన్నాయి. ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి నెలకొంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read:మగవారు ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..?
- Advertisement -