‘అశ్వ సంచాలనాసనం’తో ఆరోగ్యం..!

77
- Advertisement -

సాధారణంగా కూర్చొని పని చేసే వారిలో వెన్ను సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల డిస్క్ సమస్యలు పెరిగి వెన్ను నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యల కారణంగా కొంతమంది ఎక్కువసేపు కూర్చోలేరు, అలాగని ఎక్కువసేపు నిలబడలేరు, దాంతో డిస్క్ సమస్యలను దూరం చేసుకునేందుకు రకరకాల మెడిసన్స్ వాడుతుంటారు. అయితే డిస్క్ సమస్యలకు చెక్ పెట్టి వెన్నునొప్పి, నడుం నొప్పి వంటి వాటిని దూరం చేయడానికి యోగాలో ” అశ్వ సంచాలనాసనం ” చాలా బాగా ఉపయోగ పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల డిస్క్ సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందవచ్చట. మరి ” అశ్వ సంచాలనాసనం ” ఎలా వేయాలి.. ? ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం..!

అశ్వ సంచాలనాసనం వేయు విధానం
ముందుగా శరీరాన్నిముందుకు వంచి చేతులను పాదాల పక్కన నేలకు ఆనించాలి. తర్వాత ఎడమ కాలును పూర్తిగా వెనుకకు చాపి, కుడి కాలును మోకాలు వరకు వంచి.. మోకాలు ఛాతీకి అంచేలా చేసుకోవాలి. రెండు చేతులను కుడి కాలుకు తిన్నగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తలను వీలైనంతా పైకి ఎత్తుతూ శరీర బరువంతా ఎడమకాలుపై మరియు కుడి మోకాలు పై పడేలా చూసుకోవాలి. ఇలా చేసెటెప్పుడు శ్వాస క్రియ నెమ్మదిగా జరిగించాలి. తర్వాత రెండవ వైపు కూడా ఇలాగే చేయాలి.

ఉపయోగాలు
అశ్వ సంచలనాసనం ప్రతిరోజూ వేయడం వల్ల వెన్నెముక మరియు కాళ్ళు సాగదితకు గురౌతాయి. తద్వారా డిస్క్ సమస్యలు దరిచేరవు. కాలేయం పని తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇంకా మోకాలు చీలమండలాన్ని బలపరుస్తుంది. ఉదయ అవయవాలను శక్తివంతం చేయడంలో అశ్వ సంచాలనాసనం ఎంతగానో ఉపయోగ పడుతుందని యోగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ 10 నుంచి 15 నిముషాల పాటు ఈ ఆసనం తప్పకుండా వేయాలని యోగనిపుణుల సూచన.

Also Read:Harishrao:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే

- Advertisement -