అశుతోష్‌ దర్శకత్వంలో రిషబ్!

7
- Advertisement -

కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు శాండల్ వుడ్ స్టార్ రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ మూవీలో బిజీగా ఉండగా తాజాగా మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో చేతులు కలపనున్నారు. లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ వంటి క్లాసిక్ సినిమాల వెనుక ఉన్న మేధావే అశుతోష్ గోవారికర్.

ఈ ఇద్దరూ కలసి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీ కృష్ణదేవరాయల జీవితం ఆధారంగా భారీ పాన్ ఇండియా మాగ్నమ్ ఓపస్‌ రూపొందించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్, కపిల్ దేవ్ బయోపిక్ వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మించనున్నారు.

పీరియాడిక్ డ్రామాలను భారీ స్థాయిలో తెరకెక్కించడంలో ప్రసిద్ధి చెందిన అశుతోష్ గోవారికర్, ఈ ప్రాజెక్టును అత్యంత గ్రాండియస్‌గా రూపొందించాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ సినిమాలో దక్షిణాది సినీ తారలు మరియు బాలీవుడ్‌ ప్రముఖులు కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం.

Also Read:సీఎం కుర్చీ కోసం తీవ్రపోరాటం:డీకే

- Advertisement -