ఆషురెడ్డి.. బోల్డ్ లుక్‌

26
- Advertisement -

రోటిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా కొత్త పాత్ర‌ల్లో న‌టించిన‌ప్పుడే కెరీర్‌లో కిక్ వుంటుంది. స‌రిగ్గా అలాంటి ఓ డిఫ‌రెంట్ అండ్ బోల్డ్, హాట్ పాత్ర‌లో త్వ‌ర‌లో యేవ‌మ్ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు ఆషు రెడ్డి. హారిక అనే ముఖ్య‌పాత్ర‌లో ఆమె న‌టిస్తున్న చిత్రం యేవ‌మ్‌.. ఈ చిత్రంలోని నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటూ ఆఘ‌రెడ్డి కిక్ ఇచ్చే పాత్ర‌లో ఎందుకు క‌నిపించ‌బోతున్నారు తెలియాలంటే యేవ‌మ్ విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్ర‌వారం ఆషు రెడ్డి పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్ మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది.

దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన చాందిని చౌద‌రి పోస్ట‌ర్‌లో వున్న ‘ఆడపిల్లని అయితే ఏంటంటా? అనే రైట‌ప్ అంద‌ర్ని ఆలోచింప‌జేసింది. ఇప్పుడు ఆషు రెడ్డి నా బాడీ సూప‌ర్ డీల‌క్స్ అని ఎందుకు అంటుంది. ఇలా ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -