- Advertisement -
గోవా గవర్నర్‌గా తనని నియమించడంపై స్పందించారు అశోక్ గజపతి రాజు. చాలా ఆనందంగా ఉంది… పైడితల్లి అమ్మవారి దీవెనలు అనుకుంటున్నా అని తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం లభించింది అని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు నాపేరు ప్రతిపాదించడం.. కేంద్రం ఆమోదించడం చాలా సంతోషం అన్నారు. మోదీ ప్రధాని కాకపోతే, చంద్రబాబు సీఎం కాకపోతే.. నాకు ఈ గవర్నర్ పదవి వచ్చేది కాదు అన్నారు. గోవా వేరీ ప్రోగ్రెసివ్ స్టేట్… గవర్నర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తా… ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు అశోక్ గజపతిరాజు.
మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. గోవా గవర్నర్‌గా పి.అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్,లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.
Also Read:ఆంధ్ర ‘కింగ్ తాలూకా’…ఫస్ట్ సింగిల్
- Advertisement -

