అవకాశాల కోసం…అడుక్కోలేదు

191
Ashish Nehra on his retirement
- Advertisement -

ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు నెహ్రా గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌కు నెహ్రా అందించిన సేవలకు గుర్తుగా గ్రాండ్‌గా వీడ్కోలు పలికిన బీసీసీఐ.. ఫిరోజ్ షా కోట్లాలోని బౌలింగ్ ఎండ్‌కు నెహ్రా పేరు పెట్టింది.

ఈ సందర్భంగా మాట్లాడిన నెహ్రా తానెప్పుడూ ఫేర్‌వెల్ మ్యాచ్ కోసం ఎవరినీ అడుక్కోలేదని స్పష్టంచేశాడు. సెలక్టర్ల అనుమతి లేకుండానే ఆట మొదలుపెట్టాను.. ఇప్పుడు వాళ్ల అనుమతి లేకుండానే ముగించాను అని అతను అన్నాడు.   ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి   రిటైరవుతున్నట్లు  చెప్పాడు.

నేనుప్పుడూ ఫేర్‌వెల్ గేమ్ అడగలేదు. ఢిల్లీలో మ్యాచ్ అదృష్టవశాత్తూ వచ్చిందే. గత ఎనిమిది, తొమ్మిదేళ్లు నేను పడ్డ కష్టానికి దేవుడు ఇలా కరుణించినట్లు నేను భావిస్తున్నా అని నెహ్రా అన్నాడు. రిటైర్మెంట్ విషయాన్ని కోహ్లి, రవిశాస్త్రిలతో మాత్రమే చెప్పానని, ఏ సెలక్టర్‌తో మాట్లాడలేదని నెహ్రా తెలిపాడు.

న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నెహ్రాను ఎంపిక చేసే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని నెహ్రాతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ మధ్య కామెంట్ చేశాడు. ఈ కామెంట్ నేపథ్యంలో నెహ్రా స్పందించాడు.

- Advertisement -