హ్యాపీ బర్త్‌డే: ‘చైతూ’

244
- Advertisement -

కెరీర్ ఆరంభంలో తడబాడ్డాడు. కొంతమంది నుంచి విమర్శకులు కూడా ఎదుర్కోన్నాడు. అయినా శక్తి మేరకు పోరాడాడు. పలు విజయవంతమైన సినిమాలను తన అకౌంట్‌ లో వేసుకుని..ప్రజెంట్‌ సక్సెస్ ఫుల్‌ యంగ్ హీరోగా దూసుకుపోతున్నాడు. అతడే అక్కినేని కుర్రోడు అక్కినేని నాగచైతన్య. అక్కినేని నట వారసత్వం పునికిపుచ్చుకుని ఇండస్ట్రీలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతు…తక్కువ టైంలోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

naga chaitanya

విభిన్న కథా చిత్రాలతో అక్కినేని అభిమానలతో పాటు..అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రేమమ్, శ్వాసగా సాగిపో సినిమాలతో మంచి ఫామ్‌ లోకి వచ్చాడు. అక్కినేని కుటుంబానికి బాగా కలిసి వచ్చిన ప్రేమకథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్‌ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు.

naga chaitanya

‘జోష్‌’తో మొదలైన చైతు అడుగులు ఇటీవల విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ వరకు కొనసాగాయి. జోష్ సినిమా చైతుకి కాస్త నిరాశనే మిగిల్చినా.. ఏ మాయ చేశావేతో తనమీద ఉన్న అప నమ్మకాన్ని పటా పంచలు చేశాడు. నటనపరంగా తన మీద వచ్చిన విమర్శలు తిప్పి కొట్టాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చైతు కెరీర్‌నే మలుపు తిప్పింది . తనకు ఎలాంటి జానర్ సెట్ అవుతుందో తెలియజేసింది.

ఆ తర్వాత 100 % లవ్, ఒక లైలా కోసం, వంటి సినిమాలతో లవర్ భాయ్ అనే ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో యాక్షన్ సినిమాతో కాస్త తడపడ్డా మళ్లీ తనకు అచ్చొచ్చిన లవ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌తో నిలదొక్కుకున్నాడు. నాగ చైతన్య కెరీర్‌ కు ఒక మైలు సినిమా అంటే అది మనం మూవీనే. ప్రయోగాత్మకంగా వచ్చిన ఈసినిమా ప్రతి ఒక్కరికి మెప్పింది.

naga chaitanya

చైతన్య హైదరాబాద్‌లో పుట్టారు. కానీ పెరిగింది, చదువుకుంది మాత్రం చెన్నై, ముంబయిలలో. పాఠశాలలో చదివే రోజుల్లో సరదాగా డ్రమ్స్‌, గిటార్‌ వాయించే వారు. చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. పెద్దయ్యాక మూవీ ఆఫర్స్‌ రావడం మొదలయ్యాయి. అప్పటికీ ఆయన నటించడానికి సిద్ధంగా లేకపోవడంతో.. మొదట్లో నో అన్నారు.

తర్వాత మంచి ప్రాజెక్టు వచ్చింది కదా అని కాలిఫోర్నియాలోని యాక్టింగ్‌ స్కూల్‌ ఇన్‌ హాలీవుడ్‌ స్టూడియోస్‌లో డ్యాన్స్‌, ఫైటింగ్‌ నేర్చుకున్నారు. తర్వాత 2009లో ‘జోష్‌’ చిత్రంతోతొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగచైతన్య నటించిన ‘జోష్‌’ ఆశించిన విజయం సాధించనప్పటికీ ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్‌, నంది అవార్డు లభించాయి.

samantha-ruth

దోచేయ్ సినిమాతో ఫ్లాప్‌ లో ఉన్న చైతును ప్రేమమ్ సినిమా మళ్లీ గాడిలో పడేసింది. అంతేకాదు చైతు నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. దీని తర్వాత విడుదలైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ విభిన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది.  నాగ చైతన్య నెక్ట్స్ సోగ్గాడే చిన్ని నాయన  డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా  చేయనున్నాడు.

నాగ చైతన్య కు ప్రేమకథా చిత్రాలు కలిసి రావడమే కాదు..నిజజీవితంలో కూడా మనోడు లవర్ భాయ్ నే నిరూపించుకున్నాడు. టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంతతో ప్రేమయాణం నడిపిస్తున్నాడు. ఇద్దరి కుటుంబ సభ్యులను నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో..వచ్చే ఏడాది పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చైతు సమంత ప్రేమలో అలా అలా తేలిపోతున్నాడు.

naga chaitanya

‘‘ఏ మాయ చేసావె’ చిత్రం సమయంలో నేను, సమంత మంచి స్నేహితులయ్యాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి ఆలోచనలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అదే మా మధ్య బంధం బలపడడానికి కారణమనుకొంటా. ఇప్పటి వరకు బహుమతుల్లాంటివి ఇచ్చి పుచ్చుకోలేదు. సమంతకి నేను, నాకు సమంత పెద్ద గిఫ్ట్‌. సమంత పెళ్లి తర్వాత కూడా నటిస్తుంది. నాకంటే ఎక్కువ కష్టపడి పైకొచ్చింది సమంత. తనను అన్ని విధాలా ప్రోత్సహిస్తా’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతన్య చెప్పారు.  భవిష్యత్తులో చైతన్య మరిన్ని మంచి చిత్రాల్లో నటించి, అలరించాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -