మెగాస్టార్‌.. @50

317
Amitabh Bachchan
- Advertisement -

బాలీవుడ్‌ మెగాస్టార్‌,బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేటివరకూ నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతూనే వుంది. అమితాబ్ ఎన్నో అవాంతరాలను,ఆటుపోట్లను నవ్వుతూనే తన చిరు నవ్వుతో అధిగమించి, బాలీవుడ్‌కు పెద్ద బాలశిక్షగా నిలిచారు. తరాలు మారుతున్నా.. కొత్త హీరోలు వస్తున్నా అమితాబ్‌ మాత్రం అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. అలాంటి ఆయన నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఆయన 76 ఏళ్ళ వ‌య‌స్సు దాటినా కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తునే ఉన్నాడు.

బిగ్‌ బీ న‌టించిన తొలి సినిమా ‘సాథ్ హిందూస్థానీ’ చిత్రం 1969 ఫిబ్ర‌వ‌రి 15న మొదలైంది. ఆ రోజు ఇండ‌స్ట్రీలో తొలి అడుగు పెట్టిన అమితాబ్ నేటి వ‌ర‌కు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. త‌న పేరిట ఎన్నో రికార్డుల‌ని న‌మోదు చేసుకున్నాడు. విభిన్న పాత్ర‌ల‌లో నటిస్తూ కోట్లాది అభిమానుల ఆధరణ పొందాడు. బాలీవుడ్‌లోనే కాకుండా పలు భాష‌ల్లో అనేక సినిమాలు చేసిన బిగ్‌బీ ఇండ‌స్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

Amitabh Bachchan

ఈ నేపథ్యంలో ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్.. త‌న తండ్రి ఫోటో ఉన్న టీ ష‌ర్ట్‌తో ధరించి ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కామెంట్ పెట్టాడు. నా తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, బెస్ట్ క్రిటిక్‌, హీరో. స‌రిగ్గా రోజు ఆయ‌న త‌న సినిమా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఈ రోజుకి ఆయ‌న త‌న ప‌ని ప‌ట్ల చూపిస్తున్న ప్రేమ‌, నిబ‌ద్ధ‌త ఎంతో గొప్పది. నీకోసం మరో 50 ఏళ్లు ఏం రాసిపెట్టుందో తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కి విష్ చేద్దామ‌ని నాన్న రూంకి వెళ్ళ‌గా, బ‌య‌టికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎక్క‌డికి వెళుతున్నారు అని అడ‌గ‌గా ‘పనిచేయడానికి’ అని సమాధానం ఇచ్చారు’ అని అభిషేక్ తెలిపారు.

అంతేకాదు అమితాబ్ కూతురు శ్వేతా బ‌చ్చ‌న్ నందా కూడా త‌న తండ్రికి సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపింది. అమితాబ్ ప్ర‌స్తుతం ‘బ్రహ్మాస్త్ర’, ‘బద్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీలో కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

- Advertisement -