ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదలు తెలిపారు అర్యవైశ్య మహాసభ సభ్యులు. ఇటివలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12చైర్మన్ పదవులు, 5 వైస్ చైర్మన్ పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్నతలు తెలిపారు. ఈసందర్భంగా ఈరోజు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజికంగా వైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ గ్రహించి రాజకీయాల్లో వైశ్యులకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హాయంలోనే వైశ్యులకు ఇంతటి అరుదైన గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ వైశ్యులకు రెండు రాష్ట్ర స్ధాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారన్నారు. మోరంశెట్టి రాములుకు టిటిడి పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు.
అసిఫాబాద్, మహబూబాబాద్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా వైశ్యులను నియమించారని అన్నారు. అలాగే ధర్మపురి దేవస్థానం కమిటీ డైరెక్టర్లుగా ఆరుగురు వైశ్యులను, సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం డైరెక్టర్లుగా ఇద్దరు వైశ్యులను నియమిచారన్నారు. అన్నింటికన్నా ముఖ్యమంగా వైశ్యులు ఎన్నడూ కళలో కూడా ఉహించని విధంగా ఆర్యవైశ్య భవనానికి ఉప్పల్ భగాయత్ లో 5ఎకరాల స్ధలాన్ని కేటాయించారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ పదవులు చేపట్టిన వైశ్య సోదరులందరికి తన అభినందనలు తెలియజేశారు. గజ్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఎన్.సి రాజమౌళి గుప్తను తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు సన్మానించారు.