- Advertisement -
22 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. డ్రగ్స్ కేసులో గురువారమే బెయిల్ లభించినప్పటికి విడుదల ప్రక్రియ ఆలస్యమైంది.దీంతో ఇవాళ ఉదయం ఆర్యన్ బయటకు రాగా కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు షారుఖ్.
డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 7న ఆర్యన్‌కు జూడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆర్యన్ ఖాన్ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా గురువారం బెయిల్ లభించింది.
కొన్ని కండీషన్స్‌తో బెయిల్ లభించగా నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు.
- Advertisement -