- Advertisement -
బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు జైల్లోనే గడిపారు. అప్పటి నుండి బెయిల్‌కు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.గురువారం డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది ముంబై హై కోర్టు.
ఇప్పటికే మూడు సార్లు బెయిల్ నిరాకరించడంతో నాలుగో సారి ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. మూడు రోజులుగా ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మొత్తానికి గురువారం ఆర్యన్ ఖాన్‌కు, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ నితిన్ సంబ్రే తీర్పునిచ్చారు.
- Advertisement -