ఆ హీరోల మధ్య చిచ్చు పెట్టిందెవరు..?

240
Online News Portal
Arya turns against best buddy Vishal
- Advertisement -

హీరో విశాల్‌కు ఆర్యకు మధ్య ఉన్న స్నేహం గురించి స్పెషల్‌ గా చెప్పనవసరం లేదు, రారా పోరా అని పిలుచుకునే స్నేహం వారిది. అయితే ఇప్పుడు విశాల్‌కు విలన్‌గా మారుతున్నాడు ఆర్య. అయితే ఇది నిజ జీవితంలో కాదండోయ్.. రీల్‌ జీవితంలో శత్రువులుగా మారుతున్నారు .

ఇక అసలు వివరాల్లోకి వెళ్లితే విశాల్ ప్రస్తుతం హీరోగా ఇరుంబు తిరై సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత విశాల్‌కు జోడిగా నటిస్తుంది. ఇక పోతే హీరో ఆర్య విలన్‌ పాత్రలో కనిపించడం ఈ సినిమాకు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని కోలివుడ్‌ వర్గాలో చర్చ జరుగుతుంది. గ‌తంలో విశాల్‌, ఆర్య హీరోలుగా బాల ద‌ర్శ‌క‌త్వంలో వాడు-వీడు సినిమా చేశారు. వాడు- వీడు సినిమా అప్పట్లో వీరిద్దరికి మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

Is-Samantha-To-Romance-Vishal

విశాల్‌ తన సొంత బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పందెం కోడి, తుప్పరివాలన్‌, కత్తి సంధై, ఇరుంబు తిరై…ఇలా హీరో విశాల్‌ వరుస సినిమాలతో తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు. మరి కొద్ది రోజులోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు విశాల్‌ టీం తెలిపింది. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు పీ.ఎస్‌ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -