పెళ్లి పీటలెక్కనున్న కోలీవుడ్‌ జంట..

230
- Advertisement -

హీరొయిన్ సాయేషా సైగల్, తమిళ హీరో ఆర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సయేషా సైగల్‌, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. ఆర్య, సయేషాలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌లో ఈ ఇద్దరి లవ్ స్టోరీ చాలా కాలంగా హాట్ టాపిక్‌గా మారింది.

Arya,Sayesha Saigal

వీరిద్దరు బయట కలిసి తిరుగుతున్నా ఎప్పుడు బయట చెప్పుకోని ఈ జంట మొత్తానికి మూడు ముళ్ళకు త్వరగానే వెళ్ళడం విశేషం. ఆర్య అల్లు అర్జున్ వరుడు సినిమాలో మెయిన్ విలన్‌గా చేశాడు. వాడు వీడు-నేనే అంబానీ లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్‌లో కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు. మార్చ్ 9-10 తెదీలలో గ్రాండ్‌గా వీరి కళ్యాణంతో పాటు రిసెప్షన్ కూడా ప్లాన్ చేసారు అని అంటున్నారు. పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని సమాచారం.

- Advertisement -