లవర్స్ డే స్పెషల్.. అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశారు

274
arya sayeesha
- Advertisement -

మార్చిలో పెళ్లి చేసుకోవోతున్నామంటూ వాలెంటైన్స్ డే సందర్భంగా అఫిషియల్‌గా ప్రకటించింది కోలీవుడ్‌ ప్రేమ జంట. కొంతకాలంగా ఆర్య, సాయేషా ప్రేమ,పెళ్లిపై రకరకాల పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ మార్చిలో పెళ్లిచేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించాడు ఆర్య.

ప్రేమికుల రోజు సందర్భంగా వాలెంటైన్స్‌ డే విషెస్ చెప్పిన ఆర్య మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి అని ట్వీట్‌ చేశారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న ఆర్య మీ ప్రేమ,దీవెనలు కోరుకుంటున్నామని ట్వీట్టర్‌లో వెల్లడించారు.

గజనీకాంత్‌ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు ఆర్య, సాయేషా.బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మనవరాలు సాయేషా. ఇరు కుటుంబాలకు చెందిన వారు వీరి పెళ్లికి ఒకే చెప్పడంతో ఇవాళ అఫిషియల్‌గా ప్రకటించారు ఆర్య.

- Advertisement -