త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చు కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని పిలుపునిచ్చారు ఆప్ చీఫ్,సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి టీ పార్టీ,లంచ్,డిన్నర్‌లను ఏర్పాటుచేయాలన్నారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ నేతలందరూ ఈ విరాళాలు సేకరించే పనిలో ఉండాలన్నారు.ఈ మేరకు కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం ఢిల్లీ అసెంబ్లీలో 70 స్ధానాలుండగా 2020 ప్రారంభంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 2015 ఎన్నికల్లో 67 స్ధానాలను గెలుచుకున్న ఆప్..పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడ్డా రెండోసారి అధికారంలోకి రావడంపై ధీమాగా ఉంది.
Delhi Chief Minister Arvind Kejriwal urged the party leaders to collect funds from the public by hosting crowdfunding tea, dinner and lunch parties.