ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆదివారం ప్రధాని నివాసం వద్ద స్పెషల్ స్టేటస్ కోసం తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఈ సమాచారాన్ని తెలుసుకున్న కేజ్రీవాల్ హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఏంపీలు తెలుపుతున్న ఆందోళనకు నేను పూర్తిగా మద్దతిస్తున్నానని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా న్యాయపరమైన డిమాండ్ అయినప్పటికీ.. ప్రధాని దీనిపై స్పందించకపోవటం ఆంధ్రుల హక్కలను కాలరాస్తున్నట్లేనని కేజ్రీవాల్ మండిపడ్డాడు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపిన నేపధ్యంలో టీడీపీ ఎంపీల ఆందోళనకు కేజ్రీవాల్ మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది.