మొదటి పుట్టినరోజు సందర్బంగా కొంపల్లి లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా మొక్కలు నాటారు సిద్దిపేట వాస్తవ్యులు వ్యాపారావేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి కూతురు వంగ ఆర్వి రెడ్డి.
వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రెండవ కూతురు ఆర్వి రెడ్డి మొదటి పుట్టినరోజు సందర్బంగా మొక్కను నాటడం చాలా పవిత్రంగా భావిస్తున్నాము అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. చిన్న నాటి నుండే పిల్లలకు మొక్కలు నాటే సంస్కృతి అలవాటు చెయ్యాలి అన్నారు.

పెద్ద కూతురు అకిరా రెడ్డి పుట్టినరోజు నాడు నాటిన మొక్కకు రోజు తను నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంతటి కార్యక్రమం యజ్ఞం లా ముందుకు తీసుకెళ్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో హరితసేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, సిద్దిపేట జిల్లా హరితసేన ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read:‘సీతా పయనం’..సాంగ్ రిలీజ్

