కేంద్రప్రభుత్వం జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీపై రకరకాల సందేహాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఏ వస్తువు ధర ఎంతో తెలుసుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల సందేహలకు చెక్ పెడుతు ఇవాళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ జీఎస్టీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా వివిధ రకాల పన్ను రేట్లను తెలుసుకునేందుకు సులువుగా ఉంటుంది.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన తొలి అడుగులు వాజపేయి ప్రభుత్వ హయాంలో పడ్డాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల చెప్పారు. కాంగ్రెస్‌కు, జీఎస్టీకి సంబంధమే లేదని అన్నారు. జీఎస్టీకి సంబంధించి వాజపేయి ప్రభుత్వం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలుపాలని లేదా ఏకీకృతం చేయాలని సిఫారసు చేస్తూ టాస్క్‌ఫోర్స్ 2013లో నివేదిక సమర్పించిందని వివరించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలోని అంశాలు సరైనవేనని భావించిందని, 2006లో ఆర్థిక మంత్రి చిదంబరం జీఎస్టీ అమలుకు 2010ని గడువు తేదీగా ప్రకటించినా, అమలు చేయలేకోయారని గుర్తుచేశారు.
గతనెలలో పొందిన సేవలపైనా కస్టమర్లు కొత్త పరోక్ష పన్నుల చట్టానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌లో ఉపయోగించుకున్న క్రెడిట్ కార్డు, టెలిఫోన్, ఇతర సేవలకు సంబంధించి జూలైలో జనరేట్ అయిన బిల్లులపై జీఎస్టీ వర్తిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతంలో సేవలపై పన్ను భారం 15 శాతంగా ఉండేది. జీఎస్టీ హయాంలో 18 శాతానికి పెరిగింది. ఫలితంగా ఈనెల నుంచి సేవలపై అదనంగా చెల్లించాల్సిందే.