- Advertisement -
మాజీ కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. ఢిల్లీ లోని నిగమ్ బోధ్ శ్వశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.
అంతకుముందు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. బీజేపీ కార్యాలయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర యమునా నది ఒడ్డున గల నిగమ్ బోధ్ స్మశాన వాటిక వరుకు అంతిమ యాత్ర సాగింది. తండ్రి చితికి కుమారుడు రోహన్ నిప్పంటించారు. జైట్లీ కడసారి చూపుకోసం పార్టీ నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
- Advertisement -