అది 2014..బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరా అనేదానిపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎవరు ఉహించని విధంగా నరేంద్రమోడీ పేరును ప్రకటించారు.కొంతమంది సీనియర్లు మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు. కానీ అరుణ్ జైట్లీ మాత్రం మోడీకి బలమైన మద్దతుదారుగా నిలిచారు. మోడీ వెంటే నడిచారు.
రిజల్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రకేబినెట్‌లో కీరోల్ నిర్వహించారు. నోట్ల రద్దు,జీఎస్టీ చట్టం అమలులో కీరోల్ పోషించారు. అంతేగాదు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపికపై తన మార్క్ చూపించారు జైట్లీ. ఉమాభారతి వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో చౌహాన్ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు.
పైకి గంభీరంగా కనిపించే జైట్లీ..మనసున్న మారాజు. తన దగ్గర పనిచేసే సిబ్బంది పెళ్లిళ్లనుతన ఇంట్లోనే జరిపించే వారు. అంతేగాదు ప్రతికేసులో వారికిచ్చే ఖర్చులను నేరుగా వారికే ఇప్పించేవారు. వారి పిల్లల చదువులకు సాయం చేసేవారు. అందుకే ఆయన అమృత్ సర్ నుంచి పోటీచేస్తున్నారని ప్రకటన రాగానే స్వచ్ఛందంగా బీజేపీ ఆఫీసులు వెలిశాయి.
ఎమర్జెన్సీ సమయంలోనూ జైలు శిక్ష అనుభవించిన జైట్లీ తర్వాత ఏబీవీపీలో చేరి ఢిల్లీ విభాగం అధిపతిగా, ఆల్ ఇండియా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఎదిగారు. బోఫోర్స్ కేసుకు సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం జైట్లీనే చేశారు.
అంతేగాదు హై ప్రొఫైల్ లాయర్. మాధవ్‌రావ్ సింధియా, శరద్ యాదవ్, ఎల్ కే అడ్వాణీ వంటి వారి తరపున ఆయన కోర్టులో వాదించారు. కోకాకోలాకు వ్యతిరేకంగా పెప్సీకో దాఖలు చేసిన కేసును అరుణ్ జైట్లీనే వాదించారు.