ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన కేంద్రం.. జమ్మూ కశ్మీర్ నుంచి లడక్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.
ప్లస్ పాయింట్స్……..
()ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూ కశ్మీర్ భారత్‌లో పూర్తి భాగమైనట్టే.
()ఇతర ప్రాంతాల ప్రజలకూ అక్కడ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.
()జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా, అజెండా లాంటివేం ఉండబోవు
() జాతీయ జెండాను అవమానించడం ఇక మీదట కుదరదు
()సుప్రీం తీర్పులు, దేశంలోని మిగతా ప్రాంతాలకు వర్తించిన చట్టాలు కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి.
()పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుంది.
()ఇప్పటి వరకూ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో.. ఇక మీదట ప్రతీది మోడీ సర్కారు కనుసన్నల్లోనే జరుగుతుంది.
()జమ్మూ కశ్మీర్ ప్రజలకున్న ద్వంద్వ పౌరసత్వం రద్దువుతుంది. ఆటోమెటిగ్గా జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ రద్దవుతాయి.
()కశ్మీర్ విడిచి వెళ్లిన కశ్మీరీ పండిట్లు మళ్లీ వెనక్కి వచ్చేందుకు వీలవుతుంది. అక్కడి ఉద్యోగాల్లో బయటి వారు చేరడానికి కూడా వీలవుతుంది.
()ఆర్టికల్ 35ఏ ప్రకారం ఇక్కడి అమ్మాయిలను బయటి వ్యక్తులు పెళ్లాడితే.. ఆమెతోపాటు ఆమె సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తి దక్కదు. ఇక మీదట ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు.
()1965, 1971 యుద్ధాల సమయంలో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి ఇప్పటి వరకూ కశ్మీర్ పౌరసత్వం దక్కలేదు. ఇక మీదట వీరి కష్టాలు తీరినట్టే.
ప్రతికూలతలు..
()కశ్మీరీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా కేంద్రం భారీగా సాయుధ బలగాలను మోహరించింది.
() ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్లోని పార్టీలు న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంది.