రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ

3
- Advertisement -

ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్‌ కేసులో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు ఉతప్ప. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను పరిష్కరించలేకపోతున్నామని ఆయన్న అరెస్ట్ చేసి వారెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

రూ. 23,36,602 నష్టపరిహారాన్ని చెల్లించడంలో ఉతప్ప విఫలమయ్యారని డిసెంబర్ 4న జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌లో ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తెలిపారు. నోటీసు జారీ చేసేందుకు పోలీసులు రాబిన్ ఉతప్ప ఇంటికి వెళ్లారు. కానీ, ప్రస్తుతం ఆ నివాసం ఉండడంలేదు. దీంతో రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్‌ అమలులోకి వచ్చింది

ఉతప్ప భారతదేశం తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.

Also Read:ఇదేనా రేవంత్ తీసుకొచ్చిన మార్పు: కేటీఆర్

- Advertisement -