కొలీవుడ్ జంటకు కోర్టు నుండి అరెస్ట్‌ వారెంట్..!

311
Raadhika
- Advertisement -

త‌మిళ నటుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే.. న‌టుడు శ‌ర‌త్ కుమార్, ఆయ‌న స‌తీమ‌ణి రాధికా, లిస్టిన్ స్టీఫెన్స్ సంయుక్తంగా గ‌తంలో కొన్ని చిత్రాల‌ని నిర్మించారు.

అయితే వారు ఆ స‌మ‌యంలో రేడియ‌న్స్ మీడియా సంస్థ నుండి రూ.2 కోట్ల రుణాని తీసుకున్నారు. దానికి గాను శరత్‌కుమార్ దంపతులు చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావ‌డంతో రేడియ‌న్స్ సంస్థ వారిపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ క్ర‌మంలో శరత్‌కుమార్, రాధికా , లిస్టింగ్‌ స్టీఫెన్‌లు శుక్ర‌వారం కోర్టుకి హాజ‌రు కావ‌లసి ఉన్న‌ప్ప‌టికి వారు రాలేదు. దీంతో తాజాగా వారిని అరెస్ట్‌ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -