వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ నాలుగేళ్ళు గడిచిన ఈ మర్డర్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే ఈ కేసును తెలంగాణ సీబీఐ టేకోవర్ చేసిన తరువాత వేగంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరియు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది సీబీఐ. అటు భాస్కర్ రెడ్డి కూడా రెండు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే తనపై ఏకపక్ష దొరణిలో సీబీఐ విచారణ సాగిస్తోందని, తన విచారణపై స్టే విధిస్తూ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని అవినాష్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి విధితమే.
అయితే గడిచిన సోమవారం వరకు అవినాష్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోరాదని సూచించిన దర్మాసనం. తాజాగా ఈ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. అరెస్ట్ చేయకుండా ఆపడం తమ పని కాదని దర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో అవినాష్ రెడ్డిపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకున్న అడ్డు లేదనే చెప్పవచ్చు. దాంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా హటాత్తుగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. ఓ వైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికి జగన్ డిల్లీకి పయనం కావడం కొత్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ బడ్జెట్ జగన్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అయినప్పటికి ఇవన్నీ పక్కనపెట్టి జగన్ అత్యవసరంగా డిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యం అనే సంకేతాలు వస్తుండడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ను తప్పించేందుకే జగన్ డిల్లీ ప్రధానితో భేటీ అయ్యారనేది టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశముంది. వివేకా కేసులో మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డికి అండగా నిలుస్తూ వస్తున్నారు సిఎం జగన్. ఒకవిధంగా చెప్పాలంటే వైఎస్ జగన్ అనుమతితోనే వివేకా మర్డర్ జరిగిందనేది టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే సిఎం జగన్ కు కూడా సీబీఐ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వివేకా కేసులో సిఎం జగన్ తరువాత ఏం చేయబోతున్నారనేది ఆసక్తికర అంశం
ఇవి కూడా చదవండి…