నీ ధైర్యానికి సెల్యూట్… దటీజ్ ఆర్మీ..

241
army man face to snake gun photo
- Advertisement -

దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు త్యాగం చేస్తుంటారు సైనికులు. అడవులలో శత్రువులు, పాములు వంటి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని దేశ రక్షణ కోసం పాటు పడుతుంటారు. సాధారణంగా మనం పాము అనే మాట వింటేనే భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం. ఎక్కడా ఎక్కడా అంటూ పరుగు పందెం మొదలెడతాం. కానీ ఓ ఆర్మీ జవాన్ మాత్రం అవేం లెక్క చెయ్యలేదు. పాము అడుగు దూరంలో ఉన్నా భయపడకుండా అలానే ఉండిపోయాడు ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

army man face to snake gun photo,

అసలు విషయానికి వస్తే ఇటీవలె అమెరికాలో జూనియర్ ఆర్మీ జవాన్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ పొడవాటి పాము ఓ జవాన్ దగ్గరికి వచ్చింది. అయినా భయపడకుండా… ధైర్యంగా అలాగే ఉన్నాడు ఆ జవాన్.. అయితే ఆ జవాన్ ధైర్య, సాహసాలను పరీక్షించడానికే అలబామా ఆర్మీ అధికారే ఈ పామును వదిలాడు. ఆ సమయంలో విలియం ప్రై తీసిన ఫోటోను అలబామా నేషనల్ గార్డ్ తమ ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు విచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. నేను ఔట్ అంటూ పరిగెత్తేవాడినని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, జవాన్ సల్యూట్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -