ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

8
- Advertisement -

ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అధికారుల ఆగడాలు ఆగకపోతే ప్రజలే నక్సలైట్లుగా మారతారు అని మండిపడ్డారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను హైడ్రా ఎలా కూల్చివేస్తుందో ఆర్మూర్ లో కూడా అలాగే కూల్చివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొందరి వికలాంగులకు ఇంకా పింఛన్లు వస్తలేవు…అధికారులకు కండ్లు కానరావా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు నాది నిరుపేద పార్టీ,పేదోడి పార్టీ అని నిండు అసెంబ్లీలో చెప్పిన అని గుర్తు చేశారు. హిందువుగా పుట్టినోడు ఏడాదికి ఒకసారి గుడికి పోయి వంద కోరికలు కోరుతాడు..అవినీతి అధికారులు ప్రజల సొమ్ము అన్యాయంగా తింటే పరలోకంలో ఆ దేవుడు కూడా వాళ్ళను క్షమించడు అని కామెంట్స్ చేశారు.

Also Read:KTR: బండి సంజయ్‌పై సుప్రీం కోర్టుకు కేటీఆర్

- Advertisement -